Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత వచ్చిన ‘జైసింహా’కు కలిసి వస్తుందని అంతా భావించారు. కాని జైసింహా చిత్రం కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో బాలయ్య కలెక్షన్స్ విషయంలో వెనుకపడి పోయాడు. అయినా కూడా ఐటీ శాఖ మాత్రం బాలయ్య నిర్మాతను వదిలి పెట్టలేదు. నిర్మాణంకు అయిన ఖర్చు మరియు ఇతరత్ర విషయాలను తెలియజేయాల్సిందిగా ఐటీ శాఖ నోటీసులు ఇచ్చారు. లెక్కలు సరిగా చూపించని కారణంగా ఐటీ అధికారులు కళ్యాణ్ ఇంటిపై మరియు ఆఫీస్‌పై సోదాలు నిర్వహించారు.
సికే ఎంటర్టైన్మెంట్ ఆఫీస్‌లో మరియు ఆయన ఇంట్లో ఏం లభించాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అసలే సినిమా ఫ్లాప్ అయ్యి భారీ నష్టాలు తప్పవురా అని నెత్తిన తడిగుడ్డ వేసుకున్న నేపథ్యంలో ఇలా ఐటీ దాడులు జరగడంతో ఏం చేయాలో పాలుపోక నిర్మాత సి కళ్యాణ్ చిరాకు పడుతున్నాడు. సి కళ్యాణ్ గతంలో కూడా చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటి వరకు ఆయన ఏ ఒక్క సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అయినా కూడా ఆయన వ్యాపారాలు మరియు ఇతరత్ర ఆదాయ వనరుల కారణంగా మంచి ఆధాయంను సంపాదిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. వాటన్నింటికి లెక్కలు చూపించిన కారణంగానే సి కళ్యాణ్ ఇంటిపై ఐటీ సోదాలు జరిగినట్లుగా చెబుతున్నారు.