Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జూనియర్ ఎన్టీఆర్ మంచోడు, గొప్పోడు… ఈ మాటలు గతం లో చాలామంది సహనటులు ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు. ఇప్పుడు మరి నటుడు కూడా ఎన్టీఆర్ చాలా గొప్పోడని అంటున్నాడు అతనెవరో కాదు గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ నుండి వచ్చి వెండితెర పై ముఖ్యంగా రంగస్థలంలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జబర్దస్త్ మహేష్. ఈ సినిమాలో జబర్ధస్త్ లో నటించిన నటులు, యాంకర్ అనసూయ కు కూడా మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం మహేష్ ఎక్కడికెళ్లినా ప్రముఖ నటీనటులు అతన్ని పలకరిస్తూ ప్రశంసలు అందిస్తున్నారు. మహేష్ మహానటి లో కూడా ఒక మంచి పాత్ర చేశాడు. నిన్న ‘మహానటి’ ఆడియో వేడుక లో కూడా జబర్దస్త్ మహేష్ బాగా సందడి చేశాడు. ఝాన్సీతో కలిసి యాంకరింగ్ చేసిన మహేష్ ని స్పెషల్ గెస్ట్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ పక్కన కుర్చోబెట్టుకొని మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎన్టీఆర్ ఏమి మాట్లాడాడు అనే విషయాన్నీ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు మహేష్. మహేష్ చేసిన పోస్ట్ యదాతధంగా…
బ్రదర్ మీరు. షేక్ చేశారు. అదిరిపోయింది. చాలా ఎమోషన్ అయ్యాను మీ సీన్ చూసినప్పుడు. మనం కలుద్దాం ఇవి ఎన్టీఆర్ అన్న నాతో మాట్లాడిన గోల్డెన్ వర్డ్స్. నేను కింద కూర్చుని అన్నతో మాట్లాడుతుంటే పైన కూర్చోండి బ్రదర్ అన్నారు పైన కూర్చుంటేనే కానీ ఊర్కోలేదు. ఆయనతో మాట్లాడిన తర్వాత అర్ధమైంది ఆయన అంత గొప్పవాడు ఎందుకయ్యారో అని. లవ్ యూ సో మచ్ ఎన్టీఆర్ అన్న. మహానటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, మహానటుడితో మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థాంక్యూ సో మచ్ నాగ అశ్విన్ సార్’’ అని చెప్పుకొచ్చాడు మహేష్.