పవన్ కళ్యాణ్ తో జత కట్టనున్న బాలీవుడ్ భామ

పవన్ కళ్యాణ్ తో జత కట్టనున్న బాలీవుడ్ భామ

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమాను అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ నుదిటిన పొడవాటి బొట్టుపెట్టుకుని ఉన్న ఫొటో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ వైపు ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తూనే మరోవైపు క్రిష్ మూవీ కూడా పవన్ చేస్తున్నారట. అయితే, ఈ సినిమాలో ఒక పాత్ర కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారట. ఈ మేరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి వెల్లడించినట్టు ముంబై మిర్రర్ పేర్కొంది.

‘‘ఇది 1870 కాలానికి చెందిన కథ ఇది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. జాక్వెలిన్ ఇతర భాషల్లో నటించాలని చూస్తోంది. దానిలో భాగంగానే ఈ సినిమాను అంగీకరించారు. ఈ ఏడాది చాలాసార్లు జాక్వెలిన్ హైదరాబాద్ వెళ్లొచ్చింది. డైరెక్టర్ క్రిష్, పవన్ కళ్యాణ్‌ను ఆమె కలిశారు’’ అని ఆ వ్యక్తి వెల్లడించినట్టు ముంబై మిర్రర్ వెల్లడించింది. ఈ సినిమా కోసం 40 రోజుల కాల్‌షీట్లను జాక్వెలిన్ కేటాయించారట. ‘‘హైదరాబాద్‌లో పలు స్టూడియోల్లో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ చేయనున్నారు. స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించేలా చిత్రీకరించనున్నారు. జాక్వెలిన్ విభిన్నపాత్రలో కనిపించనున్నారు. పురాతన ఆభరణాలు, హెవీ డిజైనర్ క్లాత్స్‌ను ఆమె ధరించనున్నారు’’ అని ఆ వ్యక్తి వెల్లడించినట్టు ముంబై మిర్రర్ పేర్కొంది.