లాక్ డౌన్ ని ఉల్లంఘించినందుకు అంత పని చేశారా.. మూత్రం తాపించిన పోలీసులు

కరోనా మహమ్మారి.. లాక్ డౌన్ వేళ.. దేశమంతా అప్రమత్తత. రోజురోజుకీ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో నిఘా పెరుగుతుంది. మానవాళి ఎవరి ఇళ్లకు వారు పరిమితం అవుతూ కాలక్షేపం చేస్తున్నారు.అవసరం ఉన్నా లేకున్న ఆకతాయిగా కొందరు రోడ్ల పైకు వస్తున్నారు.ఏదో కుంటి సాకులు చెబుతూ రోడ్ల పై తిరుగుతున్నారు. విసుగెత్తిపోయిన పోలిస్ ప్రజల నిర్లక్షానికి చెప్పుకోలేని విధంగా శిక్షించాడు.జార్ఖండ్.. రాంచీలో తాజాగా ఓ వింత ఘటన జరిగింది. అదేమంటే.. లాక్‌డౌన్‌లో బయటకు వచ్చాడని.. లాఠీలతో కొట్టిన పోలీసులు ఏకంగా మూత్రం తాగించేశారు.

లాక్‌డౌన్ సమయంలో బయటకు వచ్చాడన్న కారణంతో పోలీసులు ఓ యువకుడిని విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా మూత్రం తాగించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ సమయంలో దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో ఎన్నో ఘటనలు రోజూ చోటు చేసుకోవడం విచారకరం. ప్రజల నిర్లక్ష్యం, పోలీసుల ఓవరాక్షన్.. ఒక్కోసారి తీవ్ర విమర్శలు, వివాదాలకు దారితీస్తుంది.

ఈ ఘటన రాంచీలోని హింద్‌పిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిరు వ్యాపారి అయిన ఓ యువకుడు తాజాగా ఏదో పనిమీద బయటకు వచ్చాడు. అతడిని గమనించిన గస్తీలోని పోలీసులు ఆపై తీవ్రంగా కొట్టి ఆపై మూత్రం తాపించారు. అయితే అతడు తనను విడిచిపెడితే ఇంటికిపోతానని ఎంతగా ప్రాధేయపడినా.. ఆ పోలీసులు ఎంతమాత్రం వినిపించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు హింద్‌పిరి పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.