వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరిగిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మంత్రుల పేర్లను దాదాపు ఖరారు చేసేశారు. అయితే అధికారికంగా మాత్రమే ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే తన మంత్రి వర్గాన్ని వినూత్న రీతిలో ఏర్పాటుకు జగన్ శ్రీకారం చుట్టారు. మంత్రివర్గ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ లకు 50 శాతం కేటాయించారు. ఇక అయిదుగురు డిప్యూటీ సీఎంలు కూడా ఉంటారని ఆయన స్వయంగా ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎంలుగా చేయనున్నారు. ఇక ఆయన ఈ రోజు జరిగిన వైసీపీ ఎల్పీ సమావేశంలో మాట్లాడుతూ, ఈ కొత్త మంత్రి వర్గం పదవీకాలం రెండున్నర ఏళ్లే అంటూ మరో బాంబు పేల్చారు. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గం పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని తేల్చి చెప్పారు జగన్. కొత్త మంత్రులు రాజీనామాలకు సిద్దంగా ఉండాలని, ఆ తర్వాత వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అంటే రెండున్నర ఏళ్ల తర్వాత రాజీనామా చేసిన వారి స్థానంలో మరో 20 మంది మంత్రులయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ ముఖ్యమంత్రి అయిదేళ్ల పదవీ కాలంలో కనీసం 45 మంది ఎమ్మెల్యేలకు మంత్రులయ్యే యోగం ఉందన్న మాట. ఇక శ్రీకాకుళం జిల్లా అముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఇక రేపు ముహుర్తానికే మొత్తం 25 మందితో శనివారం రోజున మంత్రుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
మంత్రులు వీరే…!
1. ఆళ్ల రామకృష్ణ రెడ్డి
2. దాడిశెట్టి రాజా
3. మేకపాటి గౌతమ్ రెడ్డి
4. కొడాలి నాని
5. బొత్స సత్యనారాయణ
6. పినిపే విశ్వరూప్
7. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
8. అవంతి శ్రీనివాస్
9. అంజద్ బాషా
10. పిల్లి సుభాష్ చంద్ర బోస్
11. తెల్లం బాలరాజు
12. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి
13. మేకతోటి సుచరిత
14. అనంత వెంకట రామిరెడ్డి
15. బాలినేని శ్రీనివాసరెడ్డి
16. ముదునూరి ప్రసాద రాజు
17. అనిల్ కుమార్ యాదవ్
18. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
19. రోజా
20. గడికోట శ్రీకాంత్ రెడ్డి
21. కాపు రామచంద్రారెడ్డి
22. ఆళ్ల నాని
23. పార్థసారథి
24. ఆనం రామనారాయణరెడ్డి
25. రఘురామిరెడ్డి