అసత్య వార్తలు ప్రచురింపజేసినా, వ్యాపింప చేసినా, ప్రభుత్వం ఫై బురదజల్లే అవాస్తవాలని వ్యాపింపజేసిన కఠిన చర్యలు తప్పవు అంటూ జిఓ 2430 జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ అంశం ఫై తెలుగుదేశం పార్టీ మరొకసారి విమర్శలు చేసింది. జీవో ని వెంటనే రద్దు చేయాలనీ డిమాండ్ చేసింది. అయితే నల్ల బ్యాడ్జి లతో ఫైర్ స్టేషన్ వద్ద నిరసనని తెలిపారు టీడీపీ నేతలు.
అయితే ఈ విషయం ఫై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసారు. జీవో ని చదివి, అక్కడి వారికీ వినిపించి ఇందులో అంత తప్పు ఏముంది అని, జీవో రద్దు చేయమని కోరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని జగన్ అన్నారు. అయితే ఈ విషయం లో జగన్ చంద్రబాబు ఫై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకి ఇంగ్లీష్ రాక, జీవో అర్ధం చేసుకోలేకపోతున్నారని భావిస్తున్న అని అన్నారు. అయితే ఇష్టమొచ్చినట్లు వార్తలు రాస్తే మేం పడాల అని అన్నారు. ఆధారాలు లేకుండా నిందలు, ఆరోపణలు చేస్తుంటే అధికారులు వాటిని మొయ్యలా అని ప్రశ్నించారు.