అమరావతి రైతులకి మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి. రాజధానిని తరలించకూడదు అని, జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనని మొదటినుండి వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే అమరావతి రైతుల చేస్తున్న ఈ పోరాటంలో వైసీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులని, ఇంకా చాల రకాలుగా విమర్శలు చేస్తూనే వున్నారు. అయితే తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
అమరావతిలో లో రైతులు ఒక పక్క పోరాటం చేస్తుంటే, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళే మూడు రాజధానుల ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ఆలోచన చాల మంచిదని అభిప్రాయం వ్యక్తం చేసారు. అయితే రాజధాని అంశం ఫై జీఎన్ రావు కమిటి ఇచ్చిన నివేదిక ఫై అసెంబ్లీ లో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఇప్పటికే ఈ నిర్ణయం ఫై నిపుణుల కమిటీ తో పాటుగా హైలెవెల్ కమిటీ ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాజధాని ఫై తుది నిర్ణయం హైలెవెల్ కమిటీ ఇచ్చే సూచనల పైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు.