జగన్ పాదయాత్ర చేస్తారా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వైఎస్ జగన్ తండ్రి బాటలో పాదయాత్ర చేస్తారని.. కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. కానీ అందులో నిజమెంత అనే విషయం జగన్ కే తెలియాలి. ఎందుకంటే జగన్ గతంలో కూడా పాదయాత్రలకు ప్లాన్ చేసి విరమించుకున్నారు. జగన్ ఎప్పుడూ షార్ట్ కట్ లనే ఇష్టపడతారని, ఇంత కష్టం రిస్క్ తీసుకోరనే మాట కూడా ఉంది.

కానీ ఈసారి అధికారం కోసం ఏం చేయడానికైనా రెడీ అయిన జగన్.. తండ్రి బాటలో పాదయాత్ర చేస్తే సీఎం పీఠం గ్యారెంటీ అని కలలు కంటున్నారట. కానీ తండ్రి సీఎం పీఠమే కనిపిస్తున్న జగన్ కు. వైఎస్ ఎదుర్కున్న కష్టాలు మాత్రం గుర్తొస్తే ఉలిక్కిపడుతున్నారట. పైగా అప్పట్లో సీఎంగా చంద్రబాబు వైఎస్ కు పూర్తిగా సహకరించారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితుల్లేవు.

చంద్రబాబు మాటెత్తితేనే ఒంటికాలిపై లేచే జగన్ కు తామెందుకు సహకరించాలని టీడీపీ మంత్రులు భావిస్తున్నారు. ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే చంద్రబాబు చెప్పినా సరే.. జగన్ కు మాత్రం మినిమమ్ కర్టసీ కూడా ఇచ్చేది లేదంటున్నారు. దీంతో జగన్ కు ముందే భయం పట్టుకుందట. అసలు వైసీపీ నేతలు మాత్రం జగన్ పాదయాత్ర చేసినప్పుడు కదా అనుకోవడం కొసమెరుపు.

మరిన్ని వార్తలు