ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తమ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో అదే ప్రభుత్వం నుంచి ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వం ప్రతినిధిగా ఎన్నుకోవడం ఆనవాయితీ. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ గత నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా జారీ చేసిన జీవో 68ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎంపీ పదవిలో ఉన్న కారణంగా విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే విజయసాయి రెడ్డి స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో కంభంపాటి రామ్మోహన్రావు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పదవిని ఎవరికి అప్పచెబుతారో అని మరో ఆసక్తి నెలకొంది. బహుశా ఇది వేరే సామాజిక వర్గం వారికి కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.