వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి మోపిదేవి అమరావతిలో మీడియా సమావేశం లో అన్నారు. అయితే ఆక్వా రంగానికి జాతీయ స్థాయిలో 49 శాతం ఉందన్న మోపిదేవి, ఈ పరిశ్రమకి సంబంధించి ఫిషింగ్ జెట్టీ ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని మీడియా తో తెలిపారు. ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ విషయం లో మినహాయింపు ఇస్తున్నామని తెలిపారు. అయితే ఈ నిర్మాణ విషయం లో రాష్ట్రంలో శ్రీకాకుళం లోని పలు ప్రాంతాలని గుర్తించామని మంత్రి అన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో విశాఖ లో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ని కోట్ల రూపాయలతో ఆధునీకరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.అయితే మండలి రద్దు విషయం గురించి ప్రస్తావిస్తూ, మండలి రద్దు ఫై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని మంత్రి మోపిదేవి అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. అంతేకాకుండా శాసన మండలి పూర్తీ స్థాయిలో రద్దయిన తరువాతే అందులో సభ్యులుగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయానికి శాసన మండలి అడ్డు పడటం తో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే.