కీలక నిర్ణయం తీసుకున్న జగన్

కీలక నిర్ణయం తీసుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో, కరోనా ని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకుంటుంది. కాగా లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా సామాన్యులు, నిరుపేదలు, రోజువారీ కూలీలు పడుతున్న అవస్థలు మాములుగా లేవు… వారందరికీ కూడా వైసీపీ ప్రభుత్వం అండగా ఉందని హామీ ఇస్తుంది. కాగా కరోనా కష్టకాలంలో సీఎం జగన్ తాను ఇచ్చిన మాటను మరొకసారి నిలబెట్టుకున్నారు. కాగా పొడుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సున్నా వడ్డీ పధకాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కాగా నేడు తాడేపల్లిగూడంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్ నొక్కి, లాంఛనంగా ప్రారంభించనున్నారు. కాగా ఈ పథకం ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నగదు చేరనుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 93 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల ఖాతాల్లోకి రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అవుతాయి. అయితే ఈ జీరో వడ్డీ పథకం కోసమని ప్రభుత్వం రూ.765.19 కోట్లు విడుదల చేసింది.