యాగం మాట సరే నిర్వహణ సంగతేంటి జగన్ ?

Jagan management of Chandi yagam

 Jagan management of Chandi yagam

ఆంధ్రప్రదేశ్ కి వైసీపీ అధినేత జగన్ కావాలని ఆకాంక్షిస్తూ సహస్ర చండీ యాగం మొదలైంది. జగన్ అంటే వీరాభిమానం వున్న ఓ విద్యావేత్త ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగం ఒకటిరెండు రోజులు కాదు మొత్తం రెండేళ్ల పాటు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు సంవత్సారాల పాటు యాగ నిర్వహణ అనేది చిన్న విషయం కాదు. భారీ ఖర్చు తో కూడుకున్న వ్యవహారం అనేది ఒక ఎత్తు అయితే ఎంతో శ్రద్ధ, నిష్ఠతో చేయాల్సిన సహస్ర చండీ యాగ నిర్వహణ మరో ఎత్తు. ఆ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెండేళ్ల పాటు సహస్ర చండీయాగం నిర్వహించడం కత్తి మీద సామే.

పైగా ఎంతో పవిత్రత కలిగిన ఇలాంటి యాగాల నిర్వహణలో ఏ చిన్న అపశృతి దొర్లినా మంచిది కాదంటారు. అందుకే రెండేళ్లపాటు యాగం అనేది ప్రచారం కోసం కాక శ్రద్ధాసక్తులతో చేయాల్సిన పని అని జగన్ తో యాగ నిర్వహణకు పూనుకున్నవాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.

ఇక యాగ నిర్వహణకు సంబంధించి ఓ విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కి అధికారం దక్కాలని యాగం తలపెట్టి దాన్ని హైదరాబాద్ లో నిర్వహించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో పార్టీ ఆఫీస్, జగన్ నివాసం గురించి విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు యాగ నిర్వహణ అంశం కూడా ఇంకో విమర్శకి అవకాశం ఇచ్చింది. చూద్దాం…జగన్ కి అధికారమే లక్ష్యంగా రెండేళ్ల పాటు తలపెట్టిన యాగం చివరకు ఏ ఫలితాన్ని ఇస్తుందో?.