జగన్ తో కలిసి పవన్ పనిచేయగలడా..?

Pawan Kalyan said that he was working out with Jagan,

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై విశాఖలో ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు టీడీపీ మిత్రపక్షంగా కొనసాగుతూ.. మరోవైపు అవసరమైతే జగన్ మద్దతు కోరతాననడం ఆయనలోని పరిణతిలేమికి నిదర్శనంగా చర్చ జరుగుతోంది. ఉద్దానం కిడ్నీ సమస్యపై పోరాటానికి జగన్ మద్దతిచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారమైపోదని అందరికీ తెలుసు. ఇక ఈ సందర్భంగా జన సేన ఓవరాక్షన్ కూడా కలకలం రేపుతోంది. ఏదో సమస్య పరిష్కారమైపోయినట్లు విజయోత్సవ ర్యాలీ తరహాలో తీసిన ర్యాలీ విమర్శకు తావిచ్చింది.

ఇప్పటిదాకా పవన్ హంగు, ఆర్భాటానికి దూరంగా నచ్చిన పని చేసుకుపోతున్నారు. ప్రజాసమస్యలపైనే దృష్టి సారిస్తున్నారు. కానీ ఆయన చుట్టూ ఉన్నవారు మాత్రం పవర్ స్టార్ మనసు తెలుసుకోవడం లేదని తెలుస్తోంది. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కంటే పవన్ ర్యాలీ హైలైట్ అయిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉద్దానం కిడ్నీ సమస్యపై జగన్ మద్దతు తీసుకుంటాననడం ద్వారా టీడీపీకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. తాము చేయాల్సిందంతా చేసి కూడా క్రెడిట్ పవన్ కు ఇస్తుంటే.. ఆయన మాత్రం అటువైపే చూస్తున్నాడని తమ్ముళ్లు మండిపడుతున్నారు.

చంద్రబాబు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే పవన్ కు చిక్కులు తప్పేలా లేవు. జనసేన ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉన్న పార్టీ కాదు. జగన్ తో కలిస్తే.. గత ఎన్నికల్లో ఆయనపై చేసిన ఘాటు విమర్శలకు పవన్ సమాధానం చెప్పుకోవాలి. అదంత వీజీ కాదు. జగన్ కూడా బాబు పవన్ కు ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వరని వైసీపీలో ఎవర్ని అడిగినా చెబుతారు. ఇలాంటి సమయంలో పవన్ జగన్ తో కలిసి పనిచేస్తానని చెప్పడం ద్వారా ఓ వ్యూహం లేని వైఖరిని బయటపెట్టారని, ఈ స్టేట్ మెంట్ ఉద్దానం బాధితుల్లో కూడా ఆశలు అడుగంటాయనే చెప్పాలి. 

మరిన్ని వార్తలు:

పవన్ కులం కోసం పోరాడరట

రజనికి రూట్ క్లియర్ చేసిన కమల్ ?