జానారెడ్డితో కాంగ్రెస్ సతమతం

tcongress-party-confusing-with-jaanareddy-activities

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కంటే.. జానారెడ్డితోనే పెద్ద సమస్య అయిపోయింది. ప్రజాక్షేత్రంలోకి పార్టీ వెళ్లాలని ప్లాన్ చేసిన ప్రతిసారీ.. జానారెడ్డి వారి గాలి తీసేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓ దశలో దీటైన పోటీ ఇచ్చేలా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కు జానారెడ్డి సడెన్ బ్రేకేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఐదు రూపాయల భోజనం బాగుందని చెప్పి.. కేసీఆర్ కు అనుకూల ఫీలర్లు వదిలారు. దీంతో జనమంతా టీఆర్ఎస్ కు పట్టం కట్టారు.

ఇప్పుడు కీలకమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి వెంకయ్యతో జానా రాసుకుపూసుకు తిరిగారు. అదేమంటే వెంకయ్య ఆత్మీయుడన్నారు. అంటే వ్యక్తిగతంగా ఆత్మీయులుంటారు కానీ.. రాజకీయంగా ఆత్మీయత ఏంటని నేతలు నివ్వెరపోయారు. అందరికీ అసంతృప్తి ఉన్నా.. జానాను ఎవరూ నిలదీయలేకపోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో పరువు తీస్తున్న జానారెడ్డి.. ఇప్పుడు ఢిల్లీ లెవల్లో కాంగ్రెస్ పరువు తీశారనే మాట వినిపిస్తోంది.

ఇప్పటిదాకా జానాను లైట్ తీసుతున్న సోనియా… ఈసారి మాత్రం ఊరుకోరని టీకాంగ్రెస్ నేతలంటున్నారు. ఇప్పటిదాకా లోకల్ పాలిటిక్స్ కాబట్టి పెద్ద పట్టించుకోలేదని, కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పార్టీ నుంచి ఓ వ్యక్తి ఉంటే.. ప్రత్యర్థిని ఆత్మీయుడని పొగడటం ద్వారా జనా తప్పుడు సంకేతాలు పంపారని చెబుతున్నారు. నిజానికి గోపాలకృష్ణ గాంధీ ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. జానా బాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు నడిస్తే.. కాంగ్రెస్ నుంచే ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

జగన్ తో కలిసి పవన్ పనిచేయగలడా..?