AP Politics: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది: నారా లోకేష్

AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh
AP Politics: Come together people.. let's fight the pandemic: Nara Lokesh

తెలంగాణలో ఎన్నికల కోడ్ రాగానే ప్రజలు రోడ్డెక్కారని సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేశ్. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని టీడీపీ నేత నారా లోకేష్ అన్నారు. “ప్రజలు భయంలో బతుకుతున్నారు.

తెలంగాణలో కూడా ఒక దశలో అదే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే కోడ్ అమల్లోకి వచ్చిందో ప్రజలు రోడ్డెక్కారు. రేపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఇలాగే నిశ్శబ్ద విప్లవం జరగబోతోంది. 2024 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా ప్రభుత్వం ఓడిపోబోతోంది” అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ వాక్యానించారు.

అలాగే, ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మారుమూల ఏజన్సీ ప్రాంతంలోని పాడుబడ్డ రహదారి కాదని… అక్షరాలా గ్రేటర్ విశాఖ పరిధిలో నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే స్టీల్ ప్లాంట్ సమీపంలోని గాజువాక కణితిరోడ్డు అంటూ ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు లోకేష్‌. ప్రజల నుంచి పన్నుమీద పన్నుతో కోట్లాదిరూపాయలు దోచుకుంటున్న సైకో ప్రభుత్వం విశాఖలాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో రోడ్ల మరమ్మతులు కూడా చేయకుండా గాలికొదిలేసిందని ఆగ్రహించారు.