పవన్ కులం కోసం పోరాడరట

Pawan Kalyan Dont work For Caste

నేను కులం కోసం కాదు మానవత్వం కోసం పోరాడతాను. నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దానం కోసం పనిచేయడం లేదు. ప్రజల కోసం ఉద్దేశించి ఈ సమస్య పై పోరాటం చేస్తున్నాను. నేను మీలో ఒకడ్ని. ఇంతమంది పాల్గొనడం, సమస్య పరిష్కారానికి కృషి చేసిన అందరికీ నమస్కారం చేసిన పవన్.

ఉద్దానం పవన్ కల్యాణ్ ప్రసంగం బులెట్ పాయింట్స్

– ఉద్దానం సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడింది

– ఎంత పెద్ద ప్రయాణం అయినా చిన్న అడుగుతోనే మొదలవుతుంది

– కులం కాదు.. మతం కాదు.. మానవత్వం కోసం పోరాడే మనిషిని నేను

– మానవత్వంతో ఇక్కడికి వచ్చిన వైద్యులకు ధన్యవాదాలు

– గత పాలకులు ఈ సమస్యను నిర్లక్ష్యం చేశారు

– ప్రాంతీయ భావం, కులం, జాతికోసం పోరాడేవారున్నారు

– మానవత్వం మంట కలుస్తున్నా పోరాడే వారు లేకపోవడం బాధాకరం

– రాజకీయాలకు అతీతంగా ఉద్దానం సమస్యను పరిష్కరించాలి

– ప్రజలకు సాయం చేయాలన్నదే నా ఉద్దేశం.. ఇందులో రాజకీయం లేదు

– ఉద్దానం సమస్యపై చాలామంది రకరకాల కారణాలు చెప్పారు

– ఉద్దానం సమస్యపైనా శక్తి మేర నా ప్రయత్నం చేస్తా

– ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా

– సమస్య పరిష్కరానికి అవసరమైతే జగన్ మద్దతు కోరతా

– రాజకీయ లబ్దికోసం కాకుండా మానవత్వంతో సమస్య పరిష్కరించాలి

– మేధా శక్తితో అణుబాంబును కనిపెట్టినప్పుడు

– ఉద్దానం సమస్యకు పరిష్కారం ఎందుకు కని పెట్టలేరు?

– ఉద్దానం సమస్య పరిష్కారానికి ఎవరి మద్దతు కోరడానికైనా సిద్ధం: పవన్ కల్యాణ్