వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో జగన్ భేటీ !

Jagan meets World Bank representatives

మూడు రోజులుగా అమెరికాలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్కడ బిజిబిజీగా గడుపుతున్నారు. మొన్న రాత్రి డల్లాస్‌లో ప్రవాసాంధ్రులు ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఆదివారం వాషింగ్టన్‌ డీసీలో ప్రపంచబ్యాంకు సహా వివిధ కంపెనీల ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వాలని వారికి జగన్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్ట్‌కు సహకరించడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్ ఇటీవలే దానిని నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారితో జగన్ చర్చలు ఏమేరకు ఫలించాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

అంతకు ముందు డల్లాస్‌లోని తెలుగువారు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ అక్కడ వారు చూపించిన అభిమానానికి ఆనందంతో ఆనదించారు. తన ఆనందాన్ని ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

తన పట్ల తెలుగువాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయని పేర్కొన్నారు. డల్లాస్ లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు.