తండ్రిని నరికి ముక్కలు ముక్కలు చేసి బకెట్ లలో దాచిన కొడుకు !

Son cut off father and hidden in buckets!

జులాయిగా తిరగడమే కాక కన్న తండ్రినే ఓ వ్యక్తి కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడొక యువకుడు. అంతటితో ఆగకుండా ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో నింపాడు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఆర్టీసీ కాలనీలో నిన్న సాయంత్రం ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ఈ దారుణం మూడు రోజుల కిందట జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి బయటకు దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం రైల్వేలో పనిచేసి పదవీ విరమణ చేసిన మారుతీ (80) మౌలాలిలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఈయనకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె వివాహం జరిపించారు. కుమారుడు కిషన్ (30), మరో కుమార్తె.. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. కిషన్ కొంత కాలంగా చెడు అలవాట్లకు బానిసగా మారి జులాయిగా తిరుగుతున్నాడు.

కిషన్ బాధ్యతా రాహిత్యంగా తిరుగుతుండటంపై తండ్రి మారుతి అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.పలుమార్లు వీరిద్దరి మధ్య ఈ విషయమై గొడవలు జరగగా ఏం జరిగిందో తెలియదు గానీ.. కిషన్ తన తండ్రిని అతి దారుణంగా నరికి చంపాడు.

ఈ హత్య జరిగిన సమయంలో తల్లి, అతడి చెల్లి ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. వారు హత్య విషయాన్ని ఎందుకు దాచి పెట్టారనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.