ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలన విషయంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద తగిలింది. అయితే సీఎం జగన్ ఇటీవల మీడియా పై కొన్ని ఆంక్షలు విధిస్తూ జీవో 2430 ను జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. కాగా ఆ జీవో ని రద్దు చేయాలనీ సీఎం జగన్ కి ఆదేశాలు వచ్చాయి. తక్షణమే ఆ జీవోని సీఎం జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) ఆదేశాలు జారీ చేశాయి.
కాగా ప్రభుత్వం తరఫున సమాచార, పౌరసంబంధాల శాఖ తరఫున అదనపు డైరెక్టర్ కిరణ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) తరఫుveyamniన ఆలపాటి సురేష్ హాజరయ్యారు. అయితే వీరి రెండు వర్గాల వాదనలు విన్నటువంటి జస్టిస్ ప్రసాద్, తక్షణమే ఆ 2430 జీవో ని ఉపసంహరించుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈనేపథ్యంలో సీఎం జగన్ ప్రభుత్వం ఆ జీవో ని ఉపసంహరించుకోడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.