పేద విద్యార్థులకు జగన్ ఒక వరం

పేద విద్యార్థులకు జగన్ ఒక వరం

ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కోసం ఏ విద్యార్థి ఎదురుచూడకూడదు.. ఏ తల్లి అప్పులు చేయకూడదన్నదే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. గురువారం జగనన్న విద్యా దీవెన రెండో విడత సొమ్ము విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ విద్యా వ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలుకుతూ.. అతి పెద్ద సామాజికి మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నత విద్య, మెరుగైన సమాజానికి మెట్టు అనే ఆలోచనతో సీఎం జగన్‌ రెండు సంవత్సరాలుగా అక్షర యజ్ఞం చేస్తున్నారు.

పేద ప్రజల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు.ఈ పథకం ద్వారా పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పొందుతున్న విద్యార్థులకు ఇదో వరం. గతంలో అరకొర ఫీజులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అవి కూడా సరైన సమయానికి అందించలేదు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.693 కోట్లు జమ చేశాం. రెండో విడతగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించాం’’ అని తెలిపారు.