రాజకీయాలు అంటేనే ప్రత్యర్థుల ఎత్తుకు పైఎత్తు వేసి వారిని చిత్తు చెయ్యడం.అలా చెయ్యకపోతే నెగ్గుకు రావడం కష్టం ఏదొకలా తమ పార్టీను నడిపించాలి అధికారంలోనే ఉంచాలి ఒకవేళ లేకపోతే తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు ఇతర పార్టీల వారు చేస్తుంటారు అలా తాము నెగ్గుకు రావడానికి ప్రజలను మరియు ఇతర పార్టీల నేతలను ఒక రకమైన సందిగ్ధంలో నెట్టెయ్యడానికి చేసే ప్రయత్నమే “మైండ్ గేమ్”. ఇది పాలిటిక్స్ లో సర్వసాధారణమే కానీ ఒకవేళ ఇది సరిగ్గా పని చేసినట్టయితే మాత్రం దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది.
నిజానికి వాళ్ళ దగ్గరకు ఎవ్వరూ రాకపోయినా ఇంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు ఆ నాయకుడు రెడీగా ఉన్నాడు మేము ఊ అంటే వచ్చేస్తారు అంటూ గతంలో బీజేపీ పార్టీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది.అది తీరా చూసే సరికి అట్టర్ ప్లాప్ అయ్యింది.కానీ ఇప్పుడు ఇదే ప్లాన్ ను ఏపీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ పార్టీ అధినేత వై ఎస్ జగన్ కూడా అమలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది.ఎందుకంటే ఎన్నికల ఫలితాలలోనే అఖండమైన మెజార్టీ వైసీపీకి వచ్చింది.
అలాగే టీడీపీ ఘోరమైన పరాజయం చూసింది.ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలలోనే ఇంకో 17 మంది మాకు టచ్ లో ఉన్నారు అంటూ ఇప్పుడు పలువు వైసీపీ నేతలు మాట్లాడ్డం మొదలు పెట్టారు.ఇది మాత్రం ఖచ్చితంగా మైండ్ గేమే అని విశ్లేషకులు అంటున్నారు.అసలు 151 స్థానాలు ఉండి వార్ వన్ సైడ్ చేసేసిన వైసీపీ ఇంకో 17 స్థానాల కోసం వెంపర్లాడే ప్రయత్నం చెయ్యడని ఇది కేవలం వారి మైండ్ గేమ్ మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అప్పుడు బీజేపీ మొదలు పెట్టిన మైండ్ గేమ్ అట్టర్ ప్లాప్ అయ్యింది మరి జగన్ స్టార్ట్ చేసిన ఈ మైండ్ గేమ్ ఏమవుతుందో చూడాలి.