“ప్రసాదు”ల్లో 12 వెల జాబ్స్…జగన్ యోచన !

-jagan-reddys-cabinet-passes-bill-allowing-only-govt-shops-to-sell-liquor
      ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునేందుకు దృష్టి సారించి ముఖ్యంగా మద్యపాన నిషేధం పై దృషి సారించారు. ఇక తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరిగింది.
      ముందు బెల్ట్ షాపులకు చెక్ పెట్టి , మద్యంపై కొత్త పాలసీ తీసుకురానున్నారని ప్రజల్లో చర్చ జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వాటి ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.
       ఇందులో భాగంగా రాష్ట్రంలో 3500 దుకాణాల్లో 12 వేల మంది సిబ్బందిని నియమించేందుకు సిద్ధమైందని చెబుతున్నారు. పట్టణాల్లో ఉండే ఒక్కో దుకాణంలో నలుగురు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో ముగ్గురు చొప్పున నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
      మద్యం దుకాణాల్లో ఒక సూపర్ వైజర్, ఇద్దరు-ముగ్గురు సేల్స్‌మెన్ ఉంటారు. సూపర్ వైజర్‌కు రూ.17,500, సేల్స్‌మెన్‌కు రూ.15 వేల చొప్పున వేతనాన్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌కు డిగ్రీ, సేల్స్‌మెన్‌కు ఇంటర్‌ విద్యార్హతగా నిర్ణయించారు. అయితే, ఏడాది ప్రాతిపదికన మాత్రమే సిబ్బందిని నియమించుకోనున్నారు.
     నగదు నిల్వలు సిబ్బంది వద్దే ఉంటాయి కాబట్టి గతంలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపుల్లో నియమించిన సిబ్బంది నుంచి సెక్యూరిటీ డిపాజిట్లు స్వీకరించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో బాండ్లను స్వీకరించనున్నారు. దీనివల్ల ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వాటి ద్వారా రికవరీ చేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు.