దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టమంటున్న  వింకీ బ్యూటీ

Devarakonda is my favorite Winky Beauty

‘అర్జున్ రెడ్డి’ అనే ఒకే ఒక్క సినిమాతో విజయ్ ఇమేజ్ ఎల్లలు దాటేసింది. ఇటీవల వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా అన్ని దక్షిణాది భాషల్లో విడుదల కావడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే తెలియని దక్షిణాది సినీ ప్రేక్షకుడు లేడు. విజయ్ దేవరకొండకు కేవలం ప్రేక్షకుల్లో మాత్రమే అభిమానులు లేరు సినీ పరిశ్రమలో కూడా ఉన్నారు.

వాళ్లలో వింకీబ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ‘కన్నుగీటి’ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ వింకీ బ్యూటీ బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది.

కానీ, ఈ భామకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. ‘డియర్ కామ్రేడ్’ చిత్ర ప్రచారంలో భాగంగా కొచ్చి వెళ్లిన విజయ్‌ను ప్రియా కలిసింది. అప్పుడు దిగిన ఫొటోను తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని తెలుగును ఇంగ్లిష్‌లో రాసింది. ఈ పోస్ట్‌కు ఇప్పటికే 5.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

View this post on Instagram

Nuvvante naaku chala ishtam😋

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on