విద్యా రంగంపై నిపుణుల కమిటీతో జగన్ భేటీ ముగిసింది. విద్యా రంగంలో మార్పులపై కమిటీకి తన అభిప్రాయాలను జగన్ తెలిపారు. ప్రతి విద్యార్థికీ మూడు జతల డ్రెస్సులు, షూలు, సాక్సులు ఇస్తామని చెప్పారు. పట్టణాల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే బాధ్యతను ‘అక్షయపాత్ర’కు, గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగిస్తామని అన్నారు. పాఠశాల, కళాశాల ఫీజుల నియంత్రణకు పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ప్రతి విద్యార్థికీ ఏటా రూ.20 వేలు అందజేస్తామని, డిగ్రీ తీసుకున్నాక ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండాలనిపారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఇక ఏపీలో ప్రభుత్వ బడులను బాగు చేయడాన్ని సవాల్ గా తీసుకున్నామని, ఏ స్థాయిలోనూ డ్రాపౌట్స్ ఉండకూడదని సీఎం జగన్ అన్నారు.