Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓవైపు నంద్యాల ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ శ్రమిస్తుంటే…. ఆ పార్టీ నేతలు మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమౌతున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తీరుపై జగన్ మండిపడుతున్నారు. మంత్రి లోకేష్ తో మీటింగ్ కు హాజరై.. పార్టీ సమన్వయ భేటీకి రాకపోవడాన్ని తప్పుబట్టారు . రేణుక తీరు బాగోలేదని అందరి ముందూ ఆగ్రహం వ్యక్తం చేశారట.
నిజానికి బుట్టా రేణుక ఎస్పీవై రెడ్డి పార్టీ మారిన దగ్గర్నుంచి వైసీపీతో అంటీముట్టనట్లే ఉంటున్నారు. ఏదో అఫ్పడప్పుడు జగన్ వచ్చినప్పుడు మాత్రమే అందరికీ కనిపిస్తున్నారు. లేదంటే సైలంట్ గా బిజినెస్ డీల్స్ చేసుకోవడంలో మునిగిపోయి ఉంటున్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ సర్కారుతో లింకులు పెట్టుకుని.. బిజినెస్ లాభాలు పెంచుకుంటున్నారు. ఇలా అయితే నంద్యాలే కాదు ఏ ఎన్నికల్లోనూ గెలవమని జగన్ సీరియస్ వార్నింగ్ ఇఛ్చారట.
ఏధైనా తప్పు చేస్తే నిజం చెప్పాలి కానీ.. అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదన్నారు జగన్. సమన్వయ కమిటీ భేటీకి రమ్మంటే సాకులు చెప్పిన రేణుక.. మంత్రి లోకేష్ ను ఎలా కలిశారని ఆయన ప్రశ్నించారు. ఈసారి ఎన్నికలు పార్టీకి జీవన్మరణ సమస్య అని, అలాంటి టైమ్ లో కూడా ఎంపీలు దారి తప్పడం సరికాదంటున్నారు జగన్.