కీలక నిర్ణయాన్ని తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి

కీలక నిర్ణయాన్ని తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. శిక్షణ కేంద్రాల పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధి లపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని నైపుణ్య వికాస కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్. అయితే యువత నైపుణ్యాభివృదిద్ది కొరకు రాష్ట్రవ్యాప్తంగా 30 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిర్మాణాలను ఏడాదిలోపు పూర్తీ చేయాలనీ జగన్ సూచించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలను తీర్చి దిద్దాలని తెలిపారు. విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలు కలిసి పని చేయాలనీ,వివిధ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలన్నీ ఈ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారానే పని చేయాలనీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమాల ఫై మంత్రి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశించడం జరిగింది. శిక్షణ,కోర్సులు,నాణ్యతని పరిశీలించేందుకు ఈ కమిటీ ఉపయోగపడాలని తెలిపారు. అయితే ఈ కమిటీలో సభ్యులుగా విద్యాశాఖ, ఐటీ విభాగాలకు చెందిన వారిని నియమించాలని సూచించారు. అయితే ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అవకాశాలు, పరిస్థితులు ఫై కీలక చర్చ నిర్వహించారు.