జనసేన -టీడీపీ పొత్తు చంద్రబాబు అరెస్టుపై ఇవాళ జగన్ ప్రసంగం?

Jagan's speech today on the arrest of Jana Sena-TDP alliance Chandrababu?
Jagan's speech today on the arrest of Jana Sena-TDP alliance Chandrababu?

చంద్రబాబు అరెస్టు, జనసేన -టీడీపీ పొత్తుపై ఇవాళ సీఎం జగన్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ నిడదవోలులో కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం జగన్. లండన్ పర్యటన తర్వాత మొదటి సారి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్నారు .

ఈ తరుణంలోనే తాజా రాజకీయ పరిణామాల పై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు, జనసేన -టీడీపీ పొత్తు పై సీఎం జగన్ ప్రసంగం ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిన్నటి విజయనగరం జిల్లా మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవంలో రాజకీయ విమర్శలు లేకుండా జగన్ ప్రసంగం సాగింది.

ఇవాళ్టి సీఎం జగన్ స్పీచ్ పై ఆసక్తి నెలకొంది. ఇక అటు ఇవాళ జగన్‌ సర్కార్‌ వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనుంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో భాగంగానే… ఇవాళ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏపీ సర్కార్‌.ఆర్థిక సహాయం చేయనుంది.