Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు, తమిళ సినీ రంగాల్లో తనదైన ముద్ర వేసిన అంజలి పుట్టిన రోజున ఆ హీరో చేసిన ట్వీట్ తో వారి మధ్య బంధం బలమైందని అర్ధమైంది. ఆ హీరో ఇంకెవరో జర్నీ తో పాటు మరికొన్ని చిత్రాల్లో అంజలికి జంటగా నటించిన జై. ఆ ఇద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు చాలా సార్లు వచ్చాయి. వాళ్ళు కూడా దాన్ని నిజం చేసేలా ప్రవర్తించడం చూస్తూనే వున్నాం. ఇప్పుడు అంజలి పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జై భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేసాడు.
” నువ్వు నాకెంతో ప్రత్యేకం. నువ్వు పుట్టిన రోజు కూడా ప్రత్యేకమే. దేవుడు, నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాం. అంజుకి జన్మదిన శుభాకాంక్షలు… ప్రేమతో జై”… ఇలా జై పెట్టిన పోస్ట్ చూడగానే వీరి మధ్య ఏదో వుందనిపించడం సహజం. దాన్ని ఖాయం చేస్తూ అంజలి రిప్లై ఇచ్చింది.” నాతో వున్నందుకు ధన్యవాదాలు జై… నువ్వెప్పుడూ నాతో ఉంటావని ఆశిస్తున్నా. ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన లేఖ రాసినందుకు కృతజ్ఞతలు. “ఇలా అంజలి సమాధానం చూడగానే ఈ జంట ఒక్కటయ్యే రోజు దగ్గరలోనే ఉందని సినీ జనాలు అనుకుంటున్నారు.