‘సరైనోడు’ ఎఫెక్ట్‌తో హిందీలో 7 కోట్లు..!

Jai Janaki movie distribution rights 7 Crore in Hindi in Bollywood

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘జయ జానకి నాయక’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. బోయపాటి మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని ట్రైర్స్‌ మరియు పోస్టర్స్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఒక మంచి ప్రేమ కథ కూడా ఉంటుందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ షాక్‌ను ఇస్తుంది. స్టార్‌ హీరోల సినిమాలు సైతం మూడు నాలుగు కోట్లు మాత్రమే పలుకుతుంది. కాని ఈ చిత్రం మాత్రం ఏకంగా 7 కోట్లకు అమ్ముడు పోయింది. 

అల్లు అర్జున్‌, బోయపాటిల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సరైనోడు’ చిత్రం హిందీలో డబ్బింగ్‌ వర్షన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. సోని నెట్వర్క్‌కు ‘సరైనోడు’ భారీ లాభాలను తెచ్చి పెట్టింది. టీవీలోనే కాకుండా యూట్యూబ్‌లో కూడా హిందీ సరైనోడు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యింది. ఆ కారణంగానే ఈ చిత్రాన్ని భారీ మొత్తం పెట్టి సదరు హిందీ ఛానెల్‌ కొనుగోలు చేయడం జరిగింది. ఒక తెలుగు సినిమా హిందీ డబ్బింగ్‌ శాటిలైట్‌ రైట్స్‌కు ఇంత భారీ మొత్తం రావడానికి కారణం ఖచ్చితంగా ‘సరైనోడు’ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఇదే చిత్రం తెలుగులో 5 కోట్లకు స్టార్‌ మాటీవీ వారు కొనుగోలు చేయడం జరిగింది. ఈ రైట్స్‌ రేంజ్‌ను చూస్తుంటే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు: