Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ లో బాహుబలి తర్వాత కొత్త రికార్డ్స్ కి స్థానం లేకుండా పోయింది. ఒకవేళ ఎవరైనా విజయం ఇచ్చిన ఉత్సాహం తో మాట్లాడినా ఆ రికార్డు కి ముందు నాన్ బాహుబలి అనే మాట చేర్చాల్సి వస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషించిన జైలవకుశ దసరా కి వారం ముందు వచ్చి కూడా ఇంకా థియేటర్స్ లో హడావిడి చేస్తూనే వుంది. ఇప్పటి దాకా ఆ సినిమా 175 కోట్ల గ్రాస్ సాధించినట్టు సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు నిర్ధారించాడు. ఆ తర్వాత స్పైడర్ కి డివైడ్ టాక్ రావడంతో జైలవకుశ ఇంకా కలెక్షన్స్ రాబడుతూనే వుంది. దీంతో శాటిలైట్ రైట్స్ తో కలుపుకుంటే ఈ సినిమా దాదాపుగా 200 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే బాహుబలి తర్వాత టాలీవుడ్ లో జైలవకుశ పేరిట కొత్త రికార్డు నమోదు అవడం ఖాయం అనిపిస్తోంది.