ఇక కొత్త రూ. వంద నోట్లు

rbi-to-print-new-rs-100-notes-from-april-2018

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌. కొత్తగా రూ. 2000 నోటును, కొత్త రూపంలో రూ. 500 నోటును మార్కెట్ లో ప్ర‌వేశ‌పెట్టిన రిజ‌ర్వ్ బ్యాంకు రూ. 100 నోటు జోలికి మాత్రం పోలేదు. డీమానిటైజేష‌న్ త‌ర్వాతా. రూ. 100 నోటు ఎలాంటి మార్పులూ చేర్పులూ లేకుండానే. చ‌లామ‌ణీ అయింది. రూ.1000 నోటును ర‌ద్దుచేసిన ఆర్బీఐ ఆ స్థానంలో డిమాండ్ ను బ‌ట్టి విడ‌త‌ల‌వారీగా రూ. 2000 నోటును, రూ. 500 నోటును, రూ. 200 నోటును రూ. 50 నోటును కొత్త‌గా అందుబాటులోకి తెచ్చారు. వాటిలో రూ. 2000 నోటు, రూ. 200 నోటు డీమానిటైజేష‌న్ త‌రువాత కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన క‌రెన్సీ. మిగిలినవి… పాత నోట్ల‌నే కొత్త రూపంలో తీసుకొచ్చారు. ఆ క్ర‌మంలోనే ఇప్పుడు పాత రూ. 100 నోటు స్థానంలో కొత్త రూ. 100 నోట్లను తీసుకురావాల‌ని ఆర్బీఐ భావిస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే ముద్ర‌ణ ప్రారంభ‌మ‌యిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త రూ. 100 నోటు అందుబాటులోకి రానుంది. పాత నోటు సైజులోనే కొత్త నోటు ఉండ‌నుంది. కొత్త నోటు వ‌చ్చిన‌ప్ప‌టికీ…పాత నోట్లు చెల్లుతాయ‌ని ఆర్బీఐ వ‌ర్గాలు చెబుతున్నాయి