Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిగ్ బాస్ షోలో జై లవకుశ టీం సందడి చేసింది. సినిమా నిర్మాత కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్ రాశీఖన్నా, నివేదా థామస్ ఎన్టీఆర్ తో కలిసి షోలో పాల్గొన్నారు. ఈ నెల 21న దసరా కానుకగా విడుదలవుతున్న జై లవకుశ కోసం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే యూనిట్ సభ్యులు బిగ్ బాస్ షోకు హాజరయ్యారు. హౌస్ లో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నివేదా థామస్ తో కలిసి దిగిన ఫొటోలను రాశిఖన్నా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హౌస్ లోకి వెళ్లడం ఓ చక్కటి అనుభూతిని కలిగించిందని రాశి అన్నారు. ఎన్టీఆర్ జై, లవ,కుశ పాత్రలు పోషించిన జై లవకుశపై ఇటు ప్రేక్షకులతో పాటు…అటు టాలీవుడ్ లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా ట్రైలర్ కు విశేష స్పందన లభించింది. ముఖ్యంగా జై పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది.