జైట్లీకి తీవ్ర అస్వస్థత….తరలి వెళ్ళిన బీజేపీ అగ్రనేతలు 

jaitley-is-seriously-ill-bjp-top-leaders-who-moved

గత రెండేళ్ళ నుంచి కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం అంతగా బాలేని విషయం తెలిసిందే. గుండె, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయన్ని చేర్చారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా, గత ఏడాది జైట్లీకి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. రెగ్యులర్ మెడికల్ చెకప్ నిమిత్తం ఈ ఏడాది జనవరిలో ఆయన అమెరికా వెళ్లారు. అనారోగ్యం కారణంగా 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

ఇక అరుణ్‌జైట్లీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అరుణ్‌జైట్లీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్య వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  జైట్లీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. తాజాగా జైట్లీ ఆరోగ్య పరిస్థితిఫై బులిటిన్ విడుదల చేసిన ఎయిమ్స్ ఈ ఉదయం అయన గుండె, మూత్రపిండ, శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరారని..

ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నామన్నారు. కాగా ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆసుపత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి వెళ్లారు.