కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. దగ్గుతో బాధపడుతున్న అండర్సన్ తొలి టెస్టుకు దూరంగా ఉంటాడని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా దగ్గు ఎక్కువగా లేదని.. మైనర్ స్టేజీలోనే ఉందని.. కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే మోచేతి గాయంతో జోఫ్రా ఆర్చర్ దూరమవ్వగా.. ఓలీ స్టోన్ వెన్నుముక సర్జరీతో దూరంగా ఉన్నాడు. తాజాగా అండర్సన్ కూడా తొలి టెస్టుకు దూరం కావడంఇంగ్లండ్‌కు షాక్ అని చెప్పొచ్చు. తొలి టెస్టుకు అండర్సన్ గైర్హాజరీలో ఇంగ్లండ్ నలుగురు బౌలర్లతో ఆడనుంది. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్‌సన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్‌లో ఎవరికి అవకాశం వస్తుందో చూడాలి.
ఇక అండర్సన్‌కు యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు యాషెస్‌లో 152 వికెట్లు తీసిన అండర్సన్.. 2010-11లో ఇంగ్లండ్ ఆసీస్ గడ్డపై యాషెస్ గెలవడంలో అండర్సన్ పాత్ర కీలకం. ఆ సీజన్‌లో 24 వికెట్లతో అండర్సన్ దుమ్మురేపాడు. ఇక ఆసీస్ గడ్డపై 18 టెస్టుల్లో 60 వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు అండర్సన్ ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 632 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఇక యాషెస్‌ను ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ దగ్గరే అట్టిపెట్టుకుంది. 2017-18లో 4-0తో గెలిచి యాషెస్‌ను గెలిచిన ఆసీస్.. 2019లో 2-2తో డ్రా చేసుకోవడంతో యాషెస్‌ను తమ దగ్గరే ఉంచుకుంది.