చిరంజీవిని మాత్రం ప్రశ్నల నుండి మినహాయింపు…!

JanaSena Chief Fires On Vanthada Illegal Mining

“అక్రమ తవ్వకాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వాటాలు అందుతున్నాయని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. అక్రమ మైనింగ్‌ ద్వారా కాంగ్రెస్ టీడీపీలు కోట్లు సంపాదిస్తున్నాయని చిరంజీవి ధ్వజమెత్తారు. వంతాడ మైనింగ్‌పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేదని చిరు అన్నారు. సోమవారం చిరంజీవి విలేకరులతో మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖమంత్రి రఘవీరారెడ్డి అవినీతి ఆస్తులపై విచారణ జరిపించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఇంకా రైతుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తామని చిరు వెల్లడించారు. వంతాడ తవ్వకాల్లో మంత్రుల హస్తం ఉందని ఆయన విమర్శించారు. మంత్రులు బినామీ పేరుతో వందల ఎకరాలు తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. రైతుల ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తామన్నారు.

chiru-pawankalyan

వ్యవసాయ శాఖమంత్రి రఘవీరారెడ్డి అవినీతి ఆస్తులపై విచారణ జరిపించాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఎరువుల సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి మంత్రులకు లేదని ఆయన విమర్సించారు. వంతాడలో రాష్ట్ర మంత్రులకు వాటాలు అందుతున్నాయని ఆయన అన్నారు. వంతాడ గనుల తవ్వకాలకు అనుమతి ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని, వంతాడకు పునాది వేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్సించారు. వంతాడ మైనింగ్‌పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, టీడీపీలకు లేదని చిరంజీవి అన్నారు. గనుల అక్రమ తవ్వకాల్లో కాంగ్రెస్, టీడీపీలకు వాటాలు అందుతున్నాయని మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.”

pawan-mining

ఇది వంతాడ గనుల మీద అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలపక ముందు పీఆర్పీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే హోదాలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు. దీనికి కొనాసగిమ్పుగా నిన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మైనింగ్ కంపెనీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు ( ఆ సమస్య చాలా పాతది అదేదో ఇప్పుడే అనుమతులు ఇచ్చినట్టు పవన్ భావించినట్టున్నారు). సదరు మైనింగ్ కంపెనీ మీద గతంలో అన్ని పార్టీల వారు గొడవ చేశారు. పార్టీ కలపక ముందు 2010లో చిరంజీవి సీబీ సిఐడి ఎంక్వైరీ కోసం కూడా డిమాండ్ చేశారు. తర్వాత కాలంలో అప్పటి ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపి మంత్రి పదవి తీసుకుని అధికారం అనుభవించినప్పుడు ఆయనకు ఈ సమస్య గుర్తు రాలేదు. ఆరేళ్ల ఎంపీగా ఉన్న కూడా ఈ సమస్య గుర్తులేదు. అలాగే ఆయన ఎవరినతే మంత్రులను ఆరోపణలు చేశారో అదే మంత్రులతో చేత్తపత్త్తలు వేసుకుని తిరిగారు. అయితే ఎవరినైనా ప్రశ్నిస్తా అని చెప్పే మీకు మీ అన్న గారిని ప్రశ్నించడం మాత్రం చేతకాలేదన్న మాట.

chiru