ఏపీ రాజకీయ వర్గాల్లో మూడో బలమైన ప్రత్నామ్యయంగా మారుతుంది అనుకున్న జనసేన పార్టీ ఇప్పుడు అధోగతి పాలెయ్యలా ఉందని చెప్పాలి.అయితే ఆ పార్టీలో పవన్ తర్వాత అంత బలమైన వ్యక్తులు సంగతి ఏమో కానీ పవన్ తర్వాత ఆ పార్టీకు ఉన్న ఏకైక బలం అయినా అలాగే బలహీనత అయినా సరే ఆ పార్టీ అభిమానులే అని చెప్పాలి.వారినే నమ్ముకొని వచ్చిన పవన్ కు ఇప్పుడు వారి వల్లే దెబ్బ తినేలా ఉన్నారని చెప్పక తప్పడంలేదు. ఒక్కసారిగా గత రెండు రోజుల్లో మారిపోయిన రాజకీయ పరిణామాలను గమనించినట్టైతే ఆ విషయం చాలా సుస్పష్టంగా వ్యక్తం అవుతోంది.
పవన్ కు అన్నయ్య అయినటువంటి చిరంజీవి జగన్ కు మద్దతు గా ఉన్నారన్న ఒక ప్రచారం తీవ్ర స్థాయిలో ఊపందుకునే సరికి మెల్లగా జనసేన పార్టీ అభిమానుల్లో చీలికలు మొదలయ్యాయి.ఒక పక్క పవన్ ను అభిమానించే వాళ్ళు అలాగే చిరుని అభిమానించడంతో పాటుగా పవన్ ను అభిమానించే వారి మధ్యే ఇప్పుడు చిచ్చు మొదలయ్యింది.ప్రస్తుతం వారిలో వారే ఒకరితో గొడవలు పడుతున్నారు.నిజంగా చిరు మద్దతు ఇచ్చారో లేదో కన్ఫర్మ్ చేసుకోకుండానే వారిలో వారే గొడవలు పడడం స్టార్ట్ చేశారు.మొత్తానికి ఈ ప్లాన్ ఎవరు వేశారో కానీ జనసేన పార్టీను అదిరిపోయేలా దెబ్బ తియ్యడానికి మరో అద్భుతమైన ముందడుగు వేశారని చెప్పాలి.