Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇప్పటిదాకా రంగంలోకి దిగకుండానే ప్రకటనలు చేస్తే లాభం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. విమర్శకులు మాత్రమే కాదు జనసేన అభిమానులు సైతం పవన్ ఎప్పుడు రంగంలోకి దిగుతారా అన్న ఆలోచనలో వున్నారు. త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రయతించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన నిర్మాణం కూడా విస్తృతంగా జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లో వున్న పార్టీ హెడ్ ఆఫీస్ ని సిద్ధం చేస్తున్నారు. కొద్ది రోజులుగా జూబిలీహిల్స్, ప్రశాసన నగర్ లోని పార్టీ కార్యాలయంలో పరిపాలనా వ్యవహారాలు నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త సామగ్రి కూడా కొనుక్కొస్తున్నారు.
పార్టీ అడ్మినిస్ట్రేటివ్ విభాగపు సిబ్బంది అంతా ఇక ఇక్కడ నుంచే పని చేస్తారు. పార్టీ నేతలతో మాట్లాడేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ టూర్ లో అవసరం అయ్యే సమాచారం అందించేందుకు , పార్టీ నేతల పని తీరుని సమీక్షించేందుకు ఐటీ విభాగం ప్రత్యేకంగా కొన్ని చర్యలు చేపట్టింది. ఈ విభాగం తయారు చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ రానున్న రోజుల్లో పార్టీకి బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నారు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన జనసేన ఆఫీస్ అన్ని రకాలుగా ముస్తాబు అవుతోంది. ఇక పని మొదలెట్టడమే తరువాయి.










