దేవరలో జాన్వీ కపూర్ పాత్ర ఇదే.. న్యూ పోస్టర్​లో బ్యూటీ అదుర్స్

దేవరలో జాన్వీ కపూర్ పాత్ర ఇదే.. న్యూ పోస్టర్​లో బ్యూటీ అదుర్స్
Cinema News

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న మరో బ్లాక్ బస్టర్ మూవీ దేవర. ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం మనకి తెలిసిందే. ఇప్పటికే ఈ భామ లుక్ కూడా రిలీజ్ అయింది. అయితే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాలో జాన్వీ పాత్రను పరిచయం చేస్తూ నెట్టింట్లో ఓ పోస్టర్ వదిలింది. ఆ పోస్టర్​లో జాన్వీ అచ్చమైన పల్లెటూరు ఆడపడుచులా అందంగా కనిపిస్తోంది. మరోవైపు లంగా వోణీలో నడుం వొయ్యారాలు వొలకబోస్తూ మెస్మరైజ్ చేస్తూ సందడి కూడా చేసింది. ఈ సినిమాలో జాన్వీ పాత్రపేరు తంగం అని టీమ్ తెలిపింది. ఈ పోస్టర్​లో జాన్వీని చూసిన నెటిజన్లు శ్రీదేవిని చూసినట్లే ఉందని కామెంట్లు పెడుతున్నారు.

దేవరలో జాన్వీ కపూర్ పాత్ర ఇదే.. న్యూ పోస్టర్​లో బ్యూటీ అదుర్స్
NTR

‘ఇదిగో మా తంగం’ అంటూ చిత్రబృందం క్యాప్షన్ పోస్టు చేసింది. ‘దేవర’ మూవీ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్​లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట. ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్ కోసం రీసెంట్​గానే గోవా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ భైరా అనే పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలసిందే.