జవాన్‌… తెలుగు బులెట్ రివ్యూ

Jawaan Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   సాయి ధరమ్‌ తేజ్‌, మెహ్రీన్‌ 
నిర్మాతలు:  దిల్ రాజు , కృష్ణ 
దర్శకత్వం :   BVS రవి 
సినిమాటోగ్రఫీ:   k V గుహన్ 
ఎడిటర్ : S R శేఖర్ 
మ్యూజిక్ : తమన్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు బి.వి.ఎస్. రవి ఇద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా జవాన్. తొలి సినిమా వాంటెడ్ ప్లాప్ తర్వాత బాగా టైం తీసుకుని రవి జవాన్ కథతో సాయి ధరమ్ తేజ్ ని ఒప్పించాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సినిమా కి ప్రముఖ దర్శకుడు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. దీంతో సినిమా మీద బాగా ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తగ్గట్టు జవాన్ వుందో, లేదో చూద్దామా.

కధ…

గుడ్, బాడ్. చిన్నప్పటి నుంచి జై, కేశవ్ ఆ రెండు లక్షణాలకు ఆనవాలుగా వుంటారు. ఏ పరిస్థితి వచ్చినా దారి తప్పకూడదు అనుకునే జై rss లో ప్రభావంతో అణువణువునా దేశ భక్తి నింపుకుంటాడు. Phd పూర్తి చేసి drdo లో సైంటిస్ట్ గా ఎదగాలని కలలు కంటాడు. ఇక కేశవ్ ఎంత పెద్ద తప్పు చేసి అయినా అనుకున్నది సాధించాలి అనుకుంటాడు. చిన్నప్పుడే దారి తప్పిన కేశవ్ డబ్బు కోసం ఏదైనా చేసే మోస్ట్ నోటోరియస్ క్రిమినల్ గా ఎదుగుతాడు. జై కలలు కంటున్న ఉద్యోగం తృటిలో తప్పిపోయిన drdo అత్యంత అధునాతనమైన ఓ మిస్సైల్ వెహికల్ ఆక్టోపస్ ని కనిపెడుతుంది. అతి తక్కువ బరువుతో ఓ మనిషితో పాటు తీసుకెళ్లగలిగే ఈ ఆక్టోపస్ ని సొంతం చేసుకోడానికి కేశవ్ కి 500 కోట్లు ఆశ చూపుతారు. ఆ డీల్ ని ఓకే చేసిన కేశవ్ దాన్ని సాధించే క్రమంలో జై అడ్డు పడతాడు. దీంతో జై తోనే ఆక్టోపస్ తెప్పించడానికి కేశవ్ ఏమి చేసాడు, జై తన దారి తప్పకుండా ఆక్టోపస్ ని, సొంత కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

జవాన్ ని ఓ కధగా చెప్పుకుంటే ఇలాంటి కధలు ఎన్నో సార్లు చూసినట్టు అనిపిస్తుంది. దానికి తగినట్టే ఫస్ట్ హాఫ్ చాలా సాదాసీదాగా నడుస్తుంది. ఎన్నో సినిమాల్లో చూసిన సీన్స్ గుర్తుకు వస్తాయి. అయితే ఆక్టోపస్ ని జై కాపాడే ఎపిసోడ్ తో ఒక్కసారిగా కధలో బిగువు మొదలు అవుతుంది. రెండో అర్ధ భాగం కి వచ్చేసరికి ఇంకాస్త పట్టు బిగుస్తుంది. విలన్ వచ్చి నేరుగా హీరో ఇంటిలో తిష్ట వేసి అతన్ని ఇబ్బంది పెట్టడం, విలన్ జాడ కోసం హీరో ప్రయత్నించడం అన్న పాయింట్ చుట్టూ రాసుకున్న కధనం బాగా గ్రిప్పింగ్ గా అనిపించింది. అయితే ఆ ఉత్కంఠకు తగ్గట్టు సీన్స్ ముగింపు ఇవ్వడంలో దర్శకుడు రవి ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. మరీ ముఖ్యంగా మొత్తం సినిమాకు కీలకమైన విలన్ ని హీరో పట్టుకునే సీన్ చాలా ఫ్లాట్ గా అనిపించింది. ఇక విలన్ పరిచయానికి తగ్గట్టు అతని ప్రవర్తన కనిపించదు. అసిస్టెంట్ కన్నా విలన్ ఎక్కువ గాబరా పడడం రొటీన్ తెలుగు సినిమా ఫార్మాట్. దానికి కాస్త భిన్నంగా వెళ్లి ఉంటే బాగుండేది.

ఇక హీరో, విలన్ ఇద్దరూ తెలివిగలవాళ్ళు అనుకోవడమే తప్ప మైండ్ గేమ్ కి సినిమాలో పెద్ద స్థానం లేదు. ఇక అన్ని కమర్షియల్ తెలుగు సినిమాల్లో లాగానే హీరోయిన్ పాటల కోసం వచ్చి వెళుతూ ఉంటుంది. సినిమా లో హీరో తన కుటుంబాన్ని విలన్ నుంచి రక్షించుకునే సీన్, ఒకే ఇంటిలో వుంటూ హీరో, విలన్ ఫోన్ సంభాషణలు, దేశం గురించి, ఫెయిల్యూర్ సక్సెస్ కొలమానం గురించి చెప్పిన డైలాగ్స్ చేసిన సీన్స్ దర్శకుడి పనితనానికి మచ్చుతునక. అయితే సినిమాని మొత్తంగా చూసినప్పుడు ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, కాస్త రొటీన్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో పాటలు సినిమా స్పీడ్ కి అడ్డం పడ్డాయి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల మీద దృష్టి పెడితే జవాన్ ఇంకా బాగుండేది.

సినిమా ఎలా వుంది అన్నది పక్కనబెడితే సాయి ధరమ్ తేజ్ నటనలో చాలా పరిణితి కనిపించింది.ఇక విలన్ గా కనిపించిన ప్రసన్న అదరగొట్టాడు. తెలుగు తెరకు ఈ సినిమాతో మంచి విలన్ దొరికినట్టే .హీరోయిన్ మెహ్రీన్ పాటలకే పరిమితం అనుకున్నా వున్న కాసేపు తన గ్లామర్, యాక్షన్ తో మెప్పించింది. జై కుటుంబసభ్యులుగా చేసిన వాళ్ళు బాగానే చేసారు. పిల్లల పాత్రలు కూడా బాగున్నాయి. డైలాగ్స్, స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా మెరుపులు వున్నాయి. అయితే ఫినిషింగ్ లో లోపాలు ఆ మెరుపులకు అడ్డం పడ్డాయి.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … ”జవాన్” కి గట్టిగా జై కొట్టలేం .
తెలుగు బులెట్ రేటింగ్ … 2 . 75 /5 .