Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్ , రాకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ , శరత్ కుమార్ , నందు , జగపతి బాబు
నిర్మాత : రవీందర్ రెడ్డి
దర్శకత్వం : బోయపాటి శ్రీను
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ
లెజెండ్, సరైనోడు వంటి రెండు సూపర్ డూపర్ హిట్స్ తర్వాత మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను చేస్తున్న చిత్రం జయ జానకి నాయక. వినాయక్ అండతో అల్లుడు శ్రీను గా పాస్ అయినప్పటికీ స్పీడ్ఉన్నోడు తో ప్లాప్ మూటగట్టుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి జయ జానకి నాయక ఓ పరీక్షగా మారింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అంచనాలు అందుకుందో, లేదో చూసేద్దామా!
కథ…
కాలేజీ లో జానకి ( రకుల్ ప్రీత్ సింగ్ ) ని కొందరు ఏడిపిస్తుంటే గగన్ ( సాయి శ్రీనివాస్ ) ఆమెని రక్షిస్తాడు. గగన్ కుటుంబం గురించి తెలిసాక జానకి అతన్ని ఇష్టపడుతుంది. అయితే కొడుకు అంటే ప్రాణాలు ఇచ్చే గగన్ తండ్రి (శరత్ కుమార్ ) ఆ ప్రేమకి ఒప్పుకోడు. పైగా కొడుకుని ఆమెకి దూరంగా పంపిస్తాడు. జానకి ప్రేమని తండ్రి ఎందుకు కాదన్నాడు ? ఆమె ఎలాంటి ప్రమాదంలో వుందో తెలుసుకున్న శ్రీనివాస్ ఆమె కోసం చేసే పోరాటమే జయ జానకి నాయక. అవసరమైతే కన్న కూతురిని కూడా చంపడానికి వెనుకాడని పాత్రలో జగపతిబాబు కనిపించారు. కధగా చెప్పుకుంటే ఇది ఎన్నోసార్లు చూసిన రొటీన్ కధే.
విశ్లేషణ …
భద్ర తర్వాత తాను మనసు పెట్టి తీసిన ప్రేమకథ ఇది అని దర్శకుడు బోయపాటి చెప్పాడు. అయితే కథ, కథనాల్లో ఇది ప్రేమ కథ అనే కన్నా ఓ యాక్షన్, డ్రామా డామినేట్ చేసింది. ఈ సినిమాని చూస్తున్నంతసేపు బోయపాటి ఇంతకు ముందు తీసిన సినిమాలు లేదా వేరే వాళ్ళు తీసిన సినిమాలు గుర్తుకు వస్తూనే వున్నాయి. ఇంత రొటీన్ వ్యవహారంలోనూ బోయపాటి యాక్షన్ సీన్స్ తో తన ప్రత్యేకత చూపించాడు. ముఖ్యంగా హంసలదీవిలో తీసిన యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. కానీ బోయపాటి రొటీన్ లో పడిపోతున్నాడు అని చెప్పడానికి ఈ సినిమా ఓ సాక్ష్యంగా నిలుస్తుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి హీరోగా నిలదొక్కుకోవడానికి మరో మంచి అవకాశం దొరికింది. బోయపాటి లాంటి దర్శకుడు దొరికాడు. అయినా హీరో అంటే డాన్స్, ఫైట్ మాత్రమే కాకుండా కొన్ని భావోద్వేగాలు పండించాల్సి ఉంటుంది. అక్కడే శ్రీను బలహీనత బయటపడుతోంది. కొన్ని సన్నివేశాల్లో ఈ లోపం బాగా కనిపించింది. ఈ సీన్స్ ఇంకో హీరో అయితే బాగా చేసే వాడేమో అనిపించింది. ఇక హీరోయిన్ గా రకుల్ బాగా చేసింది. పాత్రకి తగ్గట్టు చేసింది. అయితే అక్కడక్కడా సరైనోడు ఛాయలు కనిపించాయి. జగపతిబాబు, శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్ నటులుగా వారి బాధ్యత నెరవేర్చారు. సినిమా చూస్తున్నంత సేపు పర్లేదు అని అంతా అయిపోయాక ఇంతేగా అని అనిపించే సినిమా జయ జానకి నాయక
ప్లస్ పాయింట్స్ …
బోయపాటి మార్క్ సినిమా
యాక్షన్ ఎపిసోడ్స్
డ్రామా
మైనస్ పాయింట్స్ …
రొటీన్ కథ, కధనాలు
తెలుగు బులెట్ పంచ్ లైన్ …“జయ జానకి నాయక”… టైటిల్ క్లాస్ సినిమా మాస్.
తెలుగు బులెట్ రేటింగ్ …2 . 75 / 5 .
మరిన్ని వార్తలు: