లోక్ సత్తా పార్టీ జాతీయాద్యక్ష్యుడు జయప్రకాశ్ నారాయణ, గురువారం నాడు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి హాజరై కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా భవిష్యత్తులో మనం చాలా ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తీవమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుంటారని వాఖ్యానించారు. అయితే అంతటి ప్రమాదకరమైన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలమా, ఈమేరకు మనం ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాం…? అని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రశ్నించారు.
అంతేకాకుండా ప్రస్తుతానికి మన పీఎం, సీఎంలు, కలెక్టర్లు తప్ప మిగతా వారు ఉత్సవ విగ్రహాలుగా మిలిగిపోతున్నారని, ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆయన ఆరోపించారు. ఇకపోతే ప్రజల భవిష్యత్తు మారడానికి మన నేతలు అసలే సహాయ సహకారాలు అందించడం లేదని, ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈమేరకు మాట్లాడిన జయప్రకాశ్ నారాయణ “నేర పరిశోధన, న్యాయ విచారణ వేగంగా జరగాలని, ప్రజలు ఎన్ కౌంటర్ వంటి సత్వర న్యాయం వైపునకు ఆసక్తి కనబరుస్తున్నారని, తమ ప్రజాస్వామ్య పీఠం ఏర్పాటై 23 ఏళ్లు అవుతోందని, 3 రాజ్యాంగ సవరణలు, 8 చట్లాలు ప్రజాస్వామ్య పీఠం సాధించిన విజయాలు” అని జయప్రకాశ్ నారాయణ వాఖ్యానించారు.