Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్ జగన్ పేరు తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల కేసు చూసిన సిబిఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ కూడా తెలుసు. అప్పట్లో వైసీపీ ఆయన మీద ఆరోపణలు చేసింది. అయితే జేడీ లక్ష్మీనారాయణ నిప్పు లాంటి మనిషి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేకుండానే జనం ఆయన ఏమిటో అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పని చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ స్వచ్చంధ పదవి విరమణకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి అనుమతి వచ్చాక ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ కి సంబంధించి క్విడ్ ప్రోకో కేసుల్లో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన జేడీ గురించి ఈ తరహా ప్రచారం జరగడం కొత్త కాదు. అయితే ఇప్పుడు ఆ కేసుల్లో A 2 గా వున్న విజయసాయి రెడ్డి ఎంపీ అయ్యి ఏకంగా పీఎంఓ కార్యాలయంలో పాగా వేసిన నేపథ్యంలో జేడీ తీసుకుంటున్న నిర్ణయం ఆసక్తి రేపుతోంది.
జేడీ నిజంగా రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ లో చేరతారు అన్నది మొదటగా తలెత్తే ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అంత తేలిక కాదు. వైసీపీ కి ఆయన దూరంగా ఉంటారని జేడీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెబుతారు. ఇక మిగిలింది టీడీపీ, జనసేన. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక దాన్ని జేడీ ఎంచుకుంటారా లేక కొత్త పార్టీ ఏదైనా పెడతారా అన్నది కూడా చెప్పలేం. జేపీ లోక్ సత్తా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని జేడీ అంత ధైర్యం చేస్తారా అన్న అనుమానం ఉన్నప్పటికీ మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఏదైనా జరిగే అవకాశం వుంది.