కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచి పెట్టడం లేదు. తాజాగా నటుడు రాజశేఖర్ కుటుంబానికి కరోనా సోకింది. అయితే ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
నాకు, జీవితకు, మా ఇద్దరు కుమార్తెలు శివాని, శివాత్మీక కు కరోనా వైరస్ వచ్చిన మాట వాస్తవమే అని రాజశేఖర్ అన్నారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వెల్లడించారు. ఇద్దరు కుమార్తెలు పూర్తిగా కోలుకున్నారు అని, తను, జీవిత కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అయితే త్వరలోనే ఇంటికి చేరుకుంటాం ధన్యవాదాలు అని రాజశేఖర్ తెలిపారు.
రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చినా, అనంతరం సినిమా కోసం ఎక్కువ రోజులు కేటాయించాల్స వచ్చింది. ద్విపాత్రాభినయం చేసిన అర్జున్ సినిమా వేసవి కాలంలో విడుదల అవ్వాల్సి ఉండగా, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది.