కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘దేవర’ షూటింగు దశలో ఉంది. ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ హీరో హీరోయిన్ లు గా నటిస్తున్న ఈ చిత్రంలో, విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈమూవీ కి సంబంధించిన రెండు భారీ యాక్షన్ సీన్ లని కంప్లీట్ చేశారు మూవీ మేకర్స్. మూడో షెడ్యూల్ షూటింగుకి టీమ్ రెడీ అవుతోంది.
ఈ సినిమాలో జాలరుల ఫ్యామిలీ కి చెందిన అమ్మాయిగా జాన్వీ కపూర్ కనిపించనుందని సోషల్ మీడియా లో ఒక న్యూస్ ప్రచారం జారుతుంది. కానీ ఆమె పాత్ర కూడా విలన్ ఫ్యామిలీ కి లింకై ఉంటుందనే విషయం తాజాగా బయటికోచింది . ఆమె పాత్రకి సంబంధించిన ఒక ట్విస్ట్ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ చివరి వరకూ లాక్ చేసి ఉంచుతుందని చెబుతున్నారు. ప్రధానమైన కథతో పాటు ఆమె పాత్రకి సంబంధించిన సస్పెన్స్ కూడా కొనసాగుతూ ఉంటుందని అంటున్నారు.
ఆ ట్విస్ట్ ను ఎవరూ ఉహించలేరని, రివీల్ చేసినప్పుడు ఆడియన్స్ తప్పకుండ షాక్ అవుతారని ప్రచారం జారుతుంది . ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తునరు, ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.