ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి సరికొత్త జియో భారత్ (JioBharat) అందుబాటులోకి వచ్చింది. ఇటీవల JioBharat 4G ఫోన్ లాంచ్ చేసిన తర్వాత ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంచింది. దీన్ని రూ.999 తో కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా 2G ఫోన్‌లను ఉపయోగిస్తున్న వారికి సరసమైన ధరలో.. ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో JioBharat 4G ఫోన్‌ను పరిచయం చేసింది. భారత్‌లో మొత్తం 23 భాషలకు సపోర్టు ఇవ్వడం ద్వారా యూజర్ల విభిన్న భాషా ప్రాధాన్యతలను అందిస్తుంది.
JioBharat 4G ఫీచర్ల విషయానికొస్తే :
1.77-అంగుళాల TFT డిస్‌ప్లే
3.5mm హెడ్‌ఫోన్ జాక్
0.3MP కెమెరా విత్ LED ఫ్లాష్
1000mAh బ్యాటరీ
Jio Pay ద్వారా UPI లావాదేవీలు Jio Bharat 4G ఫోన్‌లలో చేయవచ్చు. జియో సావన్, జియో సినిమా, FM రేడియోల ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ డిజైన్ సొగసైన యాష్ బ్లాక్ వేరియంట్‌లో వస్తుంది.భారత్‌లో మొత్తం 23 భాషలకు సపోర్టు ఇవ్వడం ద్వారా యూజర్ల విభిన్న భాషా ప్రాధాన్యతలను అందిస్తుంది. అలాగే.. అదనపు మైక్రో SD కార్డ్ సపోర్ట్ ద్వారా వినియోగదారులు 128GB వరకు స్టోరేజీని విస్తరించుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ ‘భారత్’.. బ్యాక్ కార్బన్ లోగోను ప్రదర్శిస్తుంది. స్విఫ్ట్ 4G ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయగల సామర్థ్యంతో ఈ ఫోన్ అద్భుతమైన వివరణలను కేవలం రూ. 999 కే ఆఫర్ చేస్తుంది.
ఈ ఫోన్ కొనుగోలుపై జియో కేవలం రూ.123తో ఇంటర్నెట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.ఈ ప్యాకేజీపై 28 రోజుల వ్యవధితో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 14GB డేటా,వీడియో స్ట్రీమింగ్, సినిమా కోసం జియో యాప్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. అదనంగా 168GB డేటాను రూ. 1234తో అందించే ఒక సంవత్సరం ప్లాన్ కూడా ఉంది. అపరిమిత కాలింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.