జియోబుక్‌ ల్యాప్‌టాప్‌

జియోబుక్‌ ల్యాప్‌టాప్‌

టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి తెరతీయనుంది. రిలయన్స్‌ 44 వ ఏజీఎమ్‌ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్‌ నెక్ట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పాటుగా జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని అంచనా వేశారు. ఏజీఎమ్‌ సమావేశంలో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ జియోబుక్‌ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారత మార్కెట్లలోకి జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్‌ చేయనుందనే ఊహగానాలు వస్తున్నాయి.

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్‌ కోసం జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్‌ మూడు వేరియంట్లు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ సైట్‌లో కంపెనీ లిస్ట్‌ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ మాత్రం కన్ఫర్మ్‌ అవ్వలేదు. జియోబుక్‌ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్‌ ర్యామ్‌, 64 జీబీ రామ్‌ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్‌ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్‌ ఉంటుందని టెక్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.