జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్… నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఈరోజు తెల్లవారు జామున కుల్గం జిల్లా నిపొరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే.. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అది పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు దిగారు.  వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. అదేవిధంగా అనంత్ నాగ్ లో కూడా కాల్పులు జరిగాయి. ఇక్కడ జరిగిన ఎన్ కౌ     టర్ లో కూడా ఇద్దరు ఇగ్రవాదులు హతమయ్యారు.

అదేవిధంగా పుల్వామా జిల్లా త్రాల్ పరిధిలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తనిఖీలు మరిన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే గత రెండు వారాలుగా సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన పలు చోట్ల ఎన్ కౌంటర్లలో 25 మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. ఇంకా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.