శ్రీకాకుళంలో జోరు వాన…మ్యాచ్ లకి ఆటంకం 

Joru vana in Srikakulam ... interrupted matches

శ్రీకాకుళంలో జోరు వాన కురిసింది. ఉదయం నుంచి విపరీతమైన ఉక్కపోతతో ఉన్న వాతావరణం నిన్న సాయంత్రం ఒక్కసారిగా చల్లబడి భారీవర్షం కురిసింది. జార్ఘండ్‌, బీహార్‌ పరిసరాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.

అల్పపీడనం మధ్య ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు. ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరకోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది .

ఈ ప్రభావంతోనే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారిగా కొద్ది సేపు భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షంతో నగరవాసులు ఉపశమనం పొందారు. ఐతే వర్షం కారణంగా శ్రీకాకుళం జిల్లావేదికగా జరుగుతున్న సీఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీల్లో రెండవ రోజు మ్యాచ్ లకు ఆటంకం ఏర్పడింది.

భారీ వర్షం కారణంగా ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో నీరు నిలిచిపోయింది. నేటితో ఈ టోర్నమెంట్ ముగియనుండటంతో, ఈ రోజు మ్యాచ్ లను శాంతినగర్ లో నూతనంగా నిర్మించిన ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు .