తండ్రి మూడో పెళ్లి…ఆపేందుకు వాటర్ ట్యాంక్ ఎక్కిన కొడుకు

Father's third wedding ... son to climb a water tank

తండ్రి మూడో పెళ్లి చేసుకుంటున్నాడని, తన చెల్లి, తల్లికి న్యాయం చేయాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ మండలం గూడం గ్రామానికి చెందిన రామచంద్రం మూడో పెళ్లి చేసుకున్నాడు.

దీంతో తనతో పాటు తన చెల్లి, తల్లికి అన్యాయం జరుగుతోందని సందీప్ అనే యువకుడు వాటర్ టాంక్ ఎక్కాడు. తనకు న్యాయం చేయాలంటూ ఫేస్ బుక్ లైవ్ పెట్టి వాటర్ ట్యాంక్ ఎక్కాడు.

విషయం తెలుసుకున్న పట్టణ సిఐ ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చినప్పటికి యువకుడు కిందకి దిగనని మంకుపట్టి అక్కడే ఉన్నాడు. గతంలోనే రెండు పెళ్లిల్లు చేసుకున్నాడని, ఉన్న ఆస్తినంతా తాగుడు, తిరుగుళ్లకే ఖర్చు  చేస్తూ ఇదేంటని అడిగిన మా అమ్మను తీవ్రంగా కొట్టే వాడని,

ఈ మద్యే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, ఆ అమ్మాయి ఇంటికెళ్లి మా నాన్న ను పెళ్లి చేసుకోవద్దని గతంలొ జరిగిన పెళ్లిల గురించి చెప్పినా వినిపించుకోవడంలేదని సందీప్ చెల్లెలు తెలిపింది.