ఇండియన్ టీమ కోసం బీసీసీఐ కొత్త జెర్సీలు…

team-india-new-jerseys

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా మొదటి టెస్టు ఆరంభమవుతోంది.  ఈ సందర్భంగా బీసీసీఐ ఆటగాళ్లు కొత్త జెర్సీలను ఆవిష్కరించింది.

తెల్లని జెర్సీల వెనక పేర్లు ముద్రించారు. వీటిని ధరించిన క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఫొటోషూట్‌లో సరదాగా పాల్గొన్నారు.

క్రికెటర్లు కొత్త జెర్సీల్లో దిగిన చిత్రాలను వెంటనే తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసి అభిమానులతో పంచుకున్నారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇంగ్లాండ్‌ జట్లు ఇంతకు ముందే ఈ జెర్సీల్లో మెరిశాయి.